శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ కోసం దర్శకుల వెయిటింగ్
- విభిన్న కథా చిత్రాల హీరోగా శర్వానంద్
- సెట్స్ పై వున్న రెండు సినిమాలు
- ఆ ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే దృష్టి
ఇప్పటికే ఇంద్రగంటి మోహనకృష్ణ .. శ్రీకాంత్ అడ్డాల .. శ్రీనివాసరాజు ఆయనకి కథలు వినిపించారట. మరికొంతమంది దర్శకులు కథలు వినిపించే ప్రయత్నాల్లో వున్నారు. కథలైతే వింటున్నాడట గానీ .. ఇంతవరకూ ఆయన ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాలు పూర్తయిన తరువాతనే, వేరే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ముందుగా ఆయన ఎవరికి ఓకే చెబుతాడో చూడాలి మరి.