హీరో శివాజీ, చలసాని శ్రీనివాస్ లను నడిపిస్తున్నది చంద్రబాబే: సోము వీర్రాజు
- రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబే ప్రధాన అడ్డంకి
- కేంద్రం వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి తొలి స్థానం దక్కింది
- రానున్న ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తాం
కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాల వల్లే సులభతర వాణిజ్యంలో ఏపీకి తొలి స్థానం వచ్చిందని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర నిధులతోనే తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ ను పూర్తి చేస్తామని... తమ నిజాయతీని శంకించవద్దని అన్నారు. విజయనగరం జిల్లాకు జాతీయ రహదారి, గిరిజన యూనివర్శిటీ, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని చెప్పారు. 2019 ఏప్రిల్ లోనే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.