మమ్ముట్టిపై దర్శకుడు మిస్కిన్ వ్యాఖ్యలు.. మండిపడుతున్న నెటిజన్లు!
- మమ్ముట్టి అంటే నాకు చాలా ఇష్టం
- 'పెనార్బు' సినిమాలో ఆయన నటన అద్భుతం
- మమ్ముట్టి కాకుండా మరెవరు నటించినా ఓవర్ యాక్షన్ చేసుండేవారు
ఈ సినిమాలో ప్రేక్షకులు కేవలం మమ్ముట్టిని మాత్రమే చూస్తారని చెప్పారు. తాను యువకుడిగా ఉండి, మమ్ముట్టి అమ్మాయిగా పుట్టివుంటే... ఆయనను తాను అత్యాచారం చేసి ఉండేవాడినని అన్నారు. తాను అసభ్యంగా మాట్లాడుతున్నానని ఎవరూ భావించవద్దని... మమ్ముట్టి నటన తనను ఎంతగా ఆకట్టుకుందో చెప్పడానికే తాను ఈ విధంగా మాట్లాడానని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. మిస్కిన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ దర్శకుడు అయివుండి ఇలాంటి వ్యాఖ్యలేంటని ప్రశ్నిస్తున్నారు. మమ్ముట్టిపై ఉన్న గౌరవాన్ని ఇలా చూపించడం ఎంత వరకు సబబని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ఓ సూపర్ స్టార్ ను మెచ్చుకోవడానికి ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదని మరికొందరు సలహా ఇచ్చారు.