త్రిష ‘మోహిని’ ట్రైలర్ విడుదల
- ఈ నెల 27న విడుదల కానున్న‘మోహిని’
- ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్
- మహిళలకు నచ్చుతుందంటున్న దర్శకుడు
తెలుగులో కూడా ‘మోహిని’ పేరుతోనే విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఉత్కంఠ రేపుతోంది. ‘ఎన్నో వేల సంవత్సరాలుగా పూడ్చి పెట్టబడిన నిజం’ అంటూ ఈ ట్రైలర్ ప్రారంభమైంది. కాగా, దర్శకుడు మాదేష్ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఒక సామాజిక సమస్యను ప్రస్తావించామని, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అది ఉంటుందని, ముఖ్యంగా మహిళలకు ఈ చిత్రం ఎంతగానో నచ్చుతుందని అన్నారు.