ఇంత మంది రోమియోలా?... యూపీలో 15 లక్షల మందికి కౌన్సెలింగ్, 4 వేల మంది అరెస్ట్!
- గత సంవత్సరం ప్రారంభమైన 'యాంటీ రోమియో స్క్వాడ్'
- మహిళలకు భద్రత కోసం మఫ్టీలో కెమెరాలతో నిఘా
- అతిగా ప్రవర్తిస్తే అరెస్ట్: లక్నో ఏడీజీ ప్రవీణ్ కుమార్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ టీమ్ లు తిరుగుతూ ఉంటాయని, రహస్యంగా కెమెరాలు ధరించి మఫ్టీలో ఉండే వీరు, ఈవ్ టీజర్లు, బహిరంగ ప్రదేశాల్లో సమస్యలు సృష్టించే వారి చిత్రాలను బంధిస్తుంటారని తెలిపారు. ఈ టీమ్ లలో మహిళా పోలీసులు కూడా ఉన్నారని అన్నారు. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, పార్కులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీరు మహిళల భద్రతను రహస్యంగా పర్యవేక్షిస్తుంటారని చెప్పారు.