తెలుగు తెరకి 'ఝాన్సీ' .. ప్రధానపాత్రలో జ్యోతిక
- జ్యోతిక ప్రధాన పాత్రగా 'నాచ్చియార్'
- తమిళంలో భారీ విజయం
- ప్రముఖుల నుంచి ప్రశంసలు
ఈ సినిమాలో పోలీస్ అధికారిణిగా జ్యోతిక ప్రదర్శించిన నటనకు అభిమానుల నుంచి అభినందనలు దక్కాయి. అక్కడి అగ్రనటీనటులు సైతం ఆమె నటన పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జ్యోతిక పోషించినది పవర్ఫుల్ రోల్ కావడం వలన 'ఝాన్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.