ఆ ఫొటోను పోస్టు చేసేందుకు గౌరీ ఖాన్ అనుమతిచ్చిందోచ్!: షారూక్ ఖాన్
- యూరప్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తున్న షారూక్ కుటుంబం
- సోషల్ మీడియాకు గౌరీ ఖాన్ దూరం
- తొలిసారి ఫొటో పోస్టుకు అనుమతి
నిజానికి గౌరీ ఖాన్ ప్రైవసీ కోరుకుంటారు. అందుకే ఆమె గురించి పెద్దగా వార్తలు రావు. అయితే, చాలా ఏళ్ల తర్వాత షారూక్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకు అనుమతించారు. ఈ ఫొటోలో వారిద్దరూ హాలీడే మూడ్‌లో ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. గౌరీకి ఇంటర్నెట్కు దూరంగా ఉండడం అలవాటు కాగా, వారి పిల్లలు మాత్రం ఇంటర్నెట్లో దూకుడుగా ఉంటారు. ఇటీవల వారి ఫొటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.