వారానికి లక్ష రూపాయల బేరంతో హీరోయిన్ ను తెచ్చా: పోలీసుల విచారణలో జనార్దన్
- గుట్టు రట్టు చేసిన నార్త్ జోన్ పోలీసులు
- గతంలోనూ జనార్దన్ వ్యభిచార దందా
- పక్కా ప్లాన్ తో మాటువేసి అరెస్ట్
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన అతను, చానాళ్ల క్రితమే హైదరాబాద్ కు వచ్చి పద్మారావు నగర్ లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులకు పట్టుబడ్డాడు కూడా. ఇతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచగా, దీక్షా కుష్వాను హైదరాబాద్ కు తెచ్చినట్టు తెలుసుకున్నారు. పక్కా ప్లాన్ తో మఫ్టీలో రంగంలోకి దిగిన పోలీసులు, ఆమె గదిలోకి మరొకరు వెళ్లేంత వరకూ వేచిచూసి, ఆపై దాడి చేశారు. దీక్షతో పాటున్న విటుడిని, నిర్వాహకుడు జనార్దన్ ను అరెస్ట్ చేశారు. దీక్షను పునరావాస కేంద్రానికి తరలించామని వెల్లడించిన పోలీసులు, ఈ దందాలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు.