తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్
- రాజకీయ నేతలు రియలెస్టేట్ వ్యాపారుల్లా మారిపోయారు
- అయినకాడికి రాష్ట్రాన్ని అమ్మేసుకుంటున్నారు
- రానున్న రోజుల్లో అన్నాడీఎంకే కనుమరుగవుతుంది
జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడం తప్ప... తమకు మరొక మార్గం లేదని ప్రకాశ్ రాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే కానీ, కేంద్రంలో ప్రధాని మోదీ కానీ ప్రజల తరపున లేరంటూ దుయ్యబట్టారు. పార్టీలన్నింటికీ వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రజాఉద్యమం వస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో అన్నాడీఎంకే కనుమరుగు కానుందని తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని... అయితే, ఎన్నికల్లో పోటీ చేసే నాయకుడిగా మాత్రం కాదని చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన ఏదీ మారిపోదని అన్నారు. సమాజానికి మంచి జరగాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ప్రశ్నించడం మానవహక్కు అని... దాన్ని ఎవరూ వదులుకోరాదని తెలిపారు.