భయానక పరిస్థితులను ఎదుర్కొనే 'దీక్ష' పాత్రలో మంచు లక్ష్మి
- మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'వైఫ్ ఆఫ్ రామ్'
- సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- ఈ నెల 20వ తేదీన విడుదల
ఈ సినిమాలో మంచు లక్ష్మి 'దీక్ష' అనే పాత్రలో కనిపించనుంది. కొన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో దీక్ష భర్త మరణిస్తాడు. అందుకు కారణమెవరనే విషయాన్ని కనుక్కోవడానికి ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆమెకి ఎదురయ్యే భయానక పరిస్థితులు ఉత్కంఠను రేకెత్తిస్తాయట. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా,యు/ఎ సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మంచు లక్ష్మి కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.