ఆ నిర్మాత గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఆమె ఎందుకు వెళ్లింది?: పృథ్వి
- హీరోయిన్ పాత్రకు సరిపోయే వారికే నిర్మాతలు అవకాశం ఇస్తారు
- కొంత మంది వల్ల సినీ పరిశ్రమ పరువుపోతోంది
- సినిమా వాళ్లకు అద్దెకు ఇల్లు కూడా దొరకడం లేదు
సినీపరిశ్రమ పరువు పోయేలా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రవర్తిస్తున్నారని పృథ్వి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో పని చేసే మహిళలకు అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి ఒక ఆవిడ తీవ్ర ఆరోపణలు చేసిందని... మరి ఆయన గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. వాస్తవానికి నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఇండస్ట్రీలో లేరని, కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ అంటేనే జనాల్లో చులకన భావం ఏర్పడిందని అన్నారు.