'సైరా'మూవీలో హ్యూమా ఖురేషి?
- చిరంజీవి కథానాయకుడిగా 'సైరా'
- కథానాయికగా నయనతార
- కీలకమైన పాత్రలో తమన్నా
ఈ నేపథ్యంలోనే 'సైరా' టీమ్ .. ఒక కీలకమైన పాత్ర కోసం హ్యూమా ఖురేషిని సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. నరసింహారెడ్డి మొదటి భార్య పాత్రలో నయనతార నటిస్తుండగా .. మరో భార్య పాత్ర కోసం హ్యుమా ఖురేషీని తీసుకున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఆమె షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. మరో కీలకమైన పాత్రలో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.