ఆ ఒక్క డైలాగ్ తో కృష్ణగారు వరుస అవకాశాలు ఇచ్చారు: పరుచూరి గోపాలకృష్ణ
- దర్శకులు పీసీ రెడ్డి గారు డైలాగ్స్ రాయించారు
- అవి కృష్ణగారికి బాగా నచ్చాయి
- లేదంటే మా జీవితం ఏ వైపు వెళ్లేదో
ఆ సినిమాలో ఒక సందర్భంలో కృష్ణగారు "పద్మా .. మనిషిని నమ్మితే మన నోట్లో మట్టిగొడతాడు .. మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది" అనే డైలాగ్ చెబుతారు. ఆ ఒక్క డైలాగ్ నచ్చడంతో కృష్ణగారు మాకు ఏడెనిమిది సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాలు మాకు రావడానికి కారకులు 'బంగారుభూమి' సినిమాతో మాకు ఛాన్స్ ఇచ్చిన పీసీ రెడ్డి గారు. ఆ రోజున ఆయన మాతో ఆ సినిమాకి డైలాగ్స్ రాయించి వుండకపోతే .. ఆ డైలాగ్స్ కృష్ణగారి వరకూ వెళ్లకపోతే .. మా జీవితం ఏ వైపు వెళ్లేదో తెలియదు" అంటూ చెప్పుకొచ్చారు.