వైఎస్ బయోపిక్ గా 'యాత్ర' .. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్
- సెట్స్ పైకి రాజశేఖర్ రెడ్డి బయోపిక్
- ప్రధాన పాత్రలో మమ్ముట్టి
- దర్శకుడిగా మహి వి.రాఘవ్
ఈ నెల 20వ తేదీనుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. రేపటి నుంచి సెప్టెంబర్ వరకూ ఏకధాటిగా జరిగే సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా షూటింగు పార్టును ముగించనున్నారు. ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఆయా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్రలో 'బాహుబలి' ఫేమ్ ఆశ్రిత వేముగంటి .. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవమెంతన్నది చూడాలి మరి.