వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న వరలక్ష్మి
- విజయ్ సరసన ఒక సినిమా
- విశాల్ మూవీలోను కీలకపాత్ర
- ధనుష్ 'మారి' సీక్వెల్ లో కలెక్టర్ గా
తమిళంలో తాను చేసిన సినిమాలు తెలుగులోను విడుదలయ్యే విషయంలో శ్రద్ధ పెడుతోందట. ఈ కారణంగా తమిళంలో ఈ అమ్మడు చేస్తోన్న 'పందెం కోడి' సీక్వెల్ .. 'మారి' సీక్వెల్ .. విజయ్ - మురుగదాస్ మూవీ తెలుగులోను రిలీజ్ కానున్నాయి. 'పందెం కోడి' సీక్వెల్ లో నెగిటివ్ ఛాయలున్న పాత్రలోను .. 'మారి' సీక్వెల్ లో కలెక్టర్ గాను .. విజయ్ మూవీలో రాజకీయ నాయకురాలిగాను ఆమె కనిపించనుంది. ఈ సినిమాల తరువాత ఇక్కడి అవకాశాలను కూడా కొట్టేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.