మోదీ గారూ.. వంద తలలు నరికి తీసుకురండి.. మీరు చేయకపోతే.. ఆ పని మేమే చేస్తాం: జవాన్ ఔరంగజేబ్ సోదరుడు
- భారత జవాను ఔరంగజేబ్ ను పాశవికంగా చంపిన ఉగ్రవాదులు
- ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోకపోతే.. ఆ పని తామే చేస్తామన్న ఔరంగజేబ్ సోదరుడు
- ఔరంగజేబ్ సోదరుడు కూడా జవానే
ఔరంగజేబ్ సోదరుడు కూడా జవానుగానే పని చేస్తున్నాడు. తన సోదరుడి మరణంతో రంజాన్ కూడా జరుపుకోలేదని... తమ గ్రామమంతా విషాదంలో మునిగిపోయిందని చెప్పాడు. ఈ సాయంత్రంలోగా ఘటనకు సంబంధించిన వివరాలను మీరు ఇవ్వాలని... లేకపోతే తానే రాష్ట్రీయ రైఫిల్స్ కార్యాలయానికి వచ్చి, ప్రభుత్వంతో మాట్లాడి, ఏం చేయాలో నిర్ణయిస్తానని తెలిపాడు. మరోవైపు, ఔరంగజేబ్ తండ్రి కూడా కేంద్ర ప్రభుత్వానికి 72 గంటల గడువు ఇచ్చారు.