రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందుపై అబ్బాస్ నఖ్వీ విమర్శలు
- ఈరోజు సాయంత్రం రాహుల్ ఇఫ్తార్ విందు
- రాజకీయ ప్రయోజనాల కోసమే అన్న నఖ్వీ
- మరోపక్క త్రిపుల్ తలాక్ బాధితులకు బీజేపీ విందు
రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఈ విందు ఇస్తున్నారని, ఈ విషయంలో తాము మాత్రం ఏ విధంగానూ కాంగ్రెస్తో పోటీ పడటం లేదని, తాను ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ఇఫ్లార్ విందు ఇస్తున్నానని నఖ్వీ అన్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ఇఫ్తార్ విందు ఇస్తోందని భావిస్తోన్న బీజేపీ ఆ పార్టీకి పోటీగానే ఇఫ్తార్ విందు ఇస్తోందని కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు.