'శైలజా రెడ్డి అల్లుడు' గురించి అనూ ఇమ్మాన్యుయేల్
- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- చైతూ సరసన నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్
- హైలైట్ గా నిలవనున్న రమ్యకృష్ణ పాత్ర
ఈ సినిమాలో అనూ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. అది గ్రహించిన అనూ ఈ సినిమాలో తన పాత్ర చాలా ఈగోయిస్టిక్ గా ఉంటుందని చెప్పింది. కాస్త పొగరుగా కనిపించే ఈ పాత్రలో తాను కొత్తగా కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయడం ఇదేమొదటిసారి అనీ .. తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఇక తనకి తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.