కర్ణాటకలో ‘కాలా’ను అడ్డుకుంటామనడంపై కమల్ స్పందన!
- రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ ఈ మేరకు చర్చలు జరపాలి
- కర్ణాటకలో ‘కాలా’ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు
- రైతు అంశాలపైనే కాదు, సినిమాల విషయంలోనూ చర్చలు అవసరమే!
గతంలో తన చిత్రం ‘విశ్వరూపం’ను కూడా కర్ణాటకలో నిషేధించిన విషయాన్ని ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల ఫిల్మ్ ఛాంబర్స్ ఈ మేరకు చర్చలు జరపాలని సూచించారు. కర్ణాటకలోని రజనీకాంత్ అభిమానులు చాలా మంది ‘కాలా’ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. రైతులకు సంబంధించిన అంశాలపై ఏ విధంగానైతే చర్చలు అవసరమో, సినిమాల విషయంలోనూ అదే మాదిరి చర్చలు అవసరమని సూచించారు.