అరకులో రిసార్టును దాటి బయటకు రాని పవన్ కల్యాణ్!
- శనివారం రాత్రి నుంచి అరకులోనే పవన్ కల్యాణ్
- ఓ ప్రైవేటు రిసార్ట్ లో బస చేసిన జనసేనాని
- ఎవరినీ కలవని పవన్ కల్యాణ్
పవన్ ను కలవడానికి పాడేరు ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో పాటు పలువురు ప్రయత్నించినప్పటికీ, పవన్ అందుబాటులోకి రాలేదు. నేడు సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా ఎస్ కోటలో పర్యటించనున్నందున, పవన్ కల్యాణ్ తన టూర్ షెడ్యూల్ ను కాస్తంత మార్చుకున్నారని సమాచారం.