క్షమాపణ చెబుతారా? కేసు వేయమంటారా?.. 'కాలా' రజనీకాంత్‌కు జర్నలిస్ట్ నోటీసులు
- రజనీకాంత్ టీమ్‌కు నోటీసులు పంపిన జవహర్
- లిఖితపూర్వక క్షమాపణకు డిమాండ్
- లేదంటే రూ.101 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక
నోటీసులు అందిన 36 గంటల్లోగా తనకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.101 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ.. తన తండ్రి బెల్లం వ్యాపారని, 1957లో టుటికోరిన్ జిల్లా నుంచి ముంబైలోని ధరావికి వలస వచ్చారని పేర్కొన్నారు. అతనిని ‘గుడ్వాలా సేఠ్’, ‘కాలా సేఠ్’ అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడలేదన్నారు.
మరోవైపు, జవహర్ ఆరోపణలను రజనీకాంత్ టీమ్ కొట్టిపడేసింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది.