మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య
- పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తుంది
- అలాగే మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతుంది
- మోదీపై ట్వీట్ చేసిన రమ్య
పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్యపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్ కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు.