నా అనుమతి లేకుండానే ఫొటో వేస్తారా?: హీరోయిన్ రష్మి ఆగ్రహం
- ఈవెంట్ కు రష్మి హాజరవుతోందంటూ నాటా ప్రచారం
- ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మి
- తనను ఎవరూ సంప్రదించలేదని మండిపాటు
'నా అనుమతి లేకుండానే నా ఫొటో ఎలా వేస్తారు? ఈ ఈవెంట్ గురించి నన్ను ఎవరూ సంప్రదించలేదు. నా అనుమతి లేకుండా నా ఫొటోలను వేయడం ఇదే మొదటి సారి కాదు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చెక్ చేయరా?' అంటూ మండిపడింది.