రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు ఎమ్మెల్యేల తరలింపు!
- తాజ్ కృష్ణలో కొనసాగుతున్న కర్ణాటక సీఎల్పీ సమావేశం
- హైదరాబాద్ చేరిన జేడీఎస్ నేతలు కుమారస్వామిగౌడ, రేవన్న
- స్టార్ హోటల్ నోవాటెల్ లో తమ ఎమ్మెల్యేలను కలవనున్న నేతలు
విమానాశ్రయం నుంచి నేరుగా తాజ్ కృష్ణకు చేరుకున్నారు. అక్కడి నుంచి స్టార్ హోటల్ నోవాటెల్ లో బస చేసిన తమ ఎమ్మెల్యేలను వీరు కలుస్తారని తెలుస్తోంది. వీళ్లిద్దరూ అక్కడికి వెళ్లన పక్షంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు తాజ్ కృష్ణకు వస్తారని సమాచారం. రేపు అసెంబ్లీలో బీజేపీ బలపరీక్ష చేసుకోనున్న సందర్భంగా తమ పార్టీ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కాగా, ఈరోజు రాత్రి పది గంటలకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను రెండు ప్రత్యేక విమానాల్లో బెంగళూరుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.