సెన్సార్ పూర్తి చేసుకున్న 'మెహబూబా'
- ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
- కథానాయికగా నేహా శెట్టి
- ఈ నెల 11వ తేదీన విడుదల
ఈ సినిమాకి దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పూరీ వ్యవహరించాడు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని చార్మీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆకాశ్ జోడీగా నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో తండ్రీ కొడుకులకు ఒకేసారి హిట్ పడుతుందేమో చూడాలి.