తెలుగు నుంచి అవకాశాలు రావడం లేదు: అంజలి
- తమిళంలో అవకాశాలు బాగానే వున్నాయి
- అవి చేసుకుంటూ వెళుతున్నాను
- తెలుగు అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాను
"తెలుగు దర్శక నిర్మాతలు నన్ను పట్టించుకోవడం లేదు. అందువలన తెలుగు నుంచి నాకు అవకాశాలు రావడం లేదు. తమిళంలో అవకాశాలు బాగానే వున్నాయి .. దీంతో, అక్కడే వుండిపోతున్నాను. నేను సన్నబడటం వలన తమిళంలో అవకాశాలు పెరిగాయి. తెలుగు నుంచి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. మంచి పాత్రలతో వస్తే చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే వున్నాను" అని చెప్పుకొచ్చింది. ఆమె నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి మరి.