అభిమానులకు నిరాశ... మహేష్ బాబు యాదగిరిగుట్ట పర్యటన వాయిదా!
- యాదగిరిగుట్ట పర్యటన వాయిదా
- కారణాలను వెల్లడించని చిత్ర బృందం
- గుట్టపైకి చేరుకున్న అభిమానులకు నిరాశ
వాస్తవానికి ఈ ఉదయం 8 గంటల్లోపే మహేష్ బాబు, 'భరత్ అనే నేను' చిత్ర బృందం యాదగిరిగుట్టకు వచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, మహేష్ పర్యటన వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఆయన మరోసారి పర్యటిస్తారని భువనగిరి మహేష్ బాబు ఫ్యాన్స్ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.