ఇలాంటి అతి దారుణ ఘటనలు మీడియా లేకపోతే బయటకి వచ్చేవే కావు: మల్లికా శెరావత్
- కథువా, ఉన్నావో లాంటి ఘటనలపై బాలీవుడ్ నటి స్పందన
- గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తి తిరిగిన దేశం భారతదేశం
- ఇప్పుడు అత్యాచారాలకి అడ్డాగా మారింది
- మీడియా ఒత్తిడి వల్లే కొత్త చట్టం వచ్చింది
ఈ సమయంలో ప్రజలందరూ మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారని, కథువా, ఉన్నావో లాంటి దారుణ ఘటనలు మీడియా లేకపోతే బయటకి వచ్చేవే కావని మల్లికా శెరావత్ అన్నారు. దేశంలోని మీడియా ఒత్తిడి వల్లే బాలికలపై అత్యాచారం ఒడిగట్టేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం వచ్చిందని, అది మీడియా గొప్పదనమేనని వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతోన్న అత్యాచార ఘటనలు ఆందోళనకరమని అన్నారు.