సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- కథానాయిక ప్రధాన చిత్రంలో నయనతార
- జపాన్ ప్రేక్షకులను కలవనున్న రాజమౌళి!
- మహేశ్ సినిమాకు ప్రీమియర్ షోలు లేవా?
* జపాన్ లో కూడా 'బాహుబలి 2' సినిమా తన సత్తా చాటింది. ఇటీవలే అక్కడ నూరు రోజుల ప్రదర్శనను కూడా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ త్వరలో అక్కడికి వెళుతోంది. ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్లకు వెళ్లి అక్కడి ప్రేక్షకులతో దర్శకుడు రాజమౌళి ఇంటరాక్ట్ అవుతారట.
* స్టార్ హీరో సినిమా రిలీజవుతుంటే విడుదలకు ముందు రోజు ప్రీమియర్ షోలు వేయడం మామూలే. అయితే ఈ 20న విడుదలవుతున్న 'భరత్ అనే నేను' చిత్రానికి తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి ప్రీమియర్ షోలను వేయడం లేదని సమాచారం. అమెరికాలో మాత్రం సుమారు రెండు వేల ప్రీమియర్ షోలను ఏర్పాటు చేస్తున్నారు.