ఎన్టీఆర్ కోసం రెండు ఎకరాల్లో భారీ సెట్ వేయించిన త్రివిక్రమ్
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
- ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరణ
- దసరాకి రిలీజ్ చేసే ఆలోచన
రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్ అది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. ఈ సెట్ కోసం 3 నుంచి 4 కోట్ల వరకూ ఖర్చు అయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనతో వున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ఎన్టీఆర్ స్టైల్ తో .. త్రివిక్రమ్ మార్క్ తో కొనసాగుతుందని టాక్.