'ఐ ఫోన్లు' కానుకగా ఇచ్చిన మహేశ్ బాబు!
- కొరటాల నుంచి 'భరత్ అనే నేను'
- ఈ సినిమాపై నమ్మకంతో మహేశ్
- ఈ నెల 20వ తేదీన రిలీజ్
ఇక ఈ సినిమా అవుట్ పుట్ పట్ల మహేశ్ బాబు పూర్తి సంతృప్తితో వున్నాడట. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసి .. మంచి అవుట్ పుట్ కి కారణమైన డైరెక్షన్ టీమ్ ను ఆయన ఎంతగానో అభినందించాడట. అంతేకాకుండా ఆ సంతోషంతో వాళ్లందరికీ 'ఐ ఫోన్ X'లను కానుకలుగా ఇచ్చాడట. గతంలో 'శ్రీమంతుడు' హిట్ ను ఇచ్చిన కొరటాలకు మహేశ్ ఖరీదైన కారును కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.