సాయిధరమ్ తేజ్ తో ఆడిపాడనున్న మేఘ ఆకాశ్
- 'ఛల్ మోహన్ రంగ'తో ఆకట్టుకున్న మేఘ ఆకాశ్
- కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఛాన్స్
- హీరోగా సాయిధరమ్ తేజ్
ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా మేఘ ఆకాశ్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. 'ఛల్ మోహన్ రంగ' సినిమాతో గ్లామర్ పరంగాను .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ కారణంగానే ఆమెకి కిషోర్ తిరుమల సినిమాలో అవకాశం లభించినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఈ సినిమా రూపొందనుండటం విశేషం.