నెక్స్ట్ మూవీ గురించి త్వరలో చెబుతానంటోన్న నివేదా థామస్
- నివేదా థామస్ కి యూత్ లో మంచి క్రేజ్
- చదువు కారణంగా కొంత గ్యాప్
- మళ్లీ కథలు వింటోన్న నివేద
ఆ తరువాత ఆమె కొన్ని రోజుల పాటు సినిమాలను దూరం పెట్టి, తాను చేస్తోన్న కోర్స్ కి సంబంధించి లాస్ట్ సెమిష్టర్ పై దృష్టి పెట్టింది. ఆ సెమిష్టర్ పూర్తికావడంతో మళ్లీ తన తదుపరి సినిమాల కోసం కథలు వినడం మొదలుపెట్టేసింది. తనకి నచ్చిన స్క్రిప్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. తన తదుపరి సినిమాకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెబుతోంది. ఇక నివేదా ఏ స్టార్ హీరోల జోడీగా ఛాన్సులు కొట్టేస్తుందో .. ఎన్నేసి సక్సెస్ లు పట్టేస్తుందో చూడాలి.