రానా నిర్మాతగా 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం
- న్యూయార్క్ చలనచిత్రోత్సవానికి ఎంపికైన తొలి తెలుగు సినిమా
- ఈ సినిమాను సమర్పిస్తుండటం గర్వంగా ఉంది
- ప్రస్తుతం '1945' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న రానా
"ఈ చిత్రం న్యూయార్క్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా. ఇలాంటి చిత్రాన్ని సమర్పిస్తుండటం నాకు చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. ఈ పెద్ద, చిన్న సినిమాను మీకు చూపించాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది" అని ట్వీట్ చేశాడు. స్వీకర్ అగస్థి బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాత. కాగా, రానా ప్రస్తుతం '1945' అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్.