మాఫియా నేపథ్యం .. డిఫరెంట్ లుక్ తో శర్వానంద్
- సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
- ఈ నెల 6వ తేదీ నుంచి షూటింగ్ మొదలు
- మాఫియా డాన్ గా శర్వా డిఫరెంట్ లుక్
ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ విశాఖలో మొదలుకానుంది. ఆ తరువాత షెడ్యూల్స్ ను కాకినాడ .. హైదరాబాద్ లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. 'కేశవ' తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో, ఇది కూడా కొత్తదనంతో కూడుకున్న కాన్సెప్ట్ అయ్యుంటుందనే నమ్మకంతో అంతా వున్నారు.