బీహార్‌లో రాజకీయ రంగు పులుముకుంటున్న శ్రీరామ నవమి అల్లర్లు.. కేంద్రమంత్రి కుమారుడి అరెస్ట్
- బీహార్‌లో జేడీయూ-బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం
- అరిజిత్ అరెస్టును తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ
- జై శ్రీరామ్ అన్నందుకే అరెస్ట్ చేశారన్న అరిజిత్
కుమారుడి అరెస్ట్‌పై స్పందించిన చౌబే తమపై బురద జల్లేందుకు అవినీతి అధికారులు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘భారత్ మాతా కీ జై’, ‘ జైశ్రీరామ్’ నినాదాలు చేసినందుకే తనను నేరస్తుడిని చేశారని అరిజిత్ ఆరోపించారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలేది లేదని ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ పేర్కొనగా, అరిజిత్ అరెస్ట్‌ను బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోంది.