ఆ సినిమాలో నటించినంత మాత్రాన నన్ను బాధ్యురాలిని చేస్తారా?: నయనతార
- నయన్ కొత్త సినిమా విడుదలపై ఆగ్రహం
- ఇంటిని ముట్టడిస్తామన్న ఓ వర్గ ఎమ్మెల్యేలు
- సినిమా విడుదలకు, తనకు ఏం సంబంధమన్న నయన్
నయనతారకు మాత్రం ఈ ప్రత్యేకత ఎందుకని వారు ప్రశ్నించారు. చెన్నైలో ఉన్న నయన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నయనతార స్పందిస్తూ... ఈ సినిమా విడుదలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తమిళంలో ఈ సినిమాను ఎవరు విడుదల చేస్తున్నారో కూడా తనకు తెలియదని చెప్పారు. కేవలం ఆ సినిమాలో నటించినందుకు తనను బాధ్యురాలిగా చేయడం ఎంతవరకు న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేసింది.