మళ్లీ సునీల్ ను నిలబెట్టే ప్రయత్నంలో త్రివిక్రమ్
- ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ
- సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో సునీల్
- అద్భుతంగా డిజైన్ చేసిన త్రివిక్రమ్
కొంతకాలంగా ఆయనను ఒక్క సక్సెస్ కూడా పలకరించలేదు. దాంతో అవకాశం వస్తే హీరోగా చేయాలనీ, లేదంటే కమెడియన్ గా చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. పూర్తిస్థాయి కమెడియన్ గా ఆయనను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ తో చేస్తోన్న సినిమాలో సునీల్ కి సెక్యూరిటీ ఆఫీసర్ పాత్ర ఇచ్చాడు. సునీల్ కోసం ఈ పాత్రను ఒక రేంజ్ లో డిజైన్ చేసి .. సునీల్ ను మళ్లీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ కి పూర్వవైభవం వస్తుందేమో చూడాలి.