1984లో ఆగిన పూరీ జగన్నాథ 'రత్న భండార్' లెక్కింపు... తిరిగి తెరచుకోనున్న గదులు!
- పూరీ ఆలయంలో 7 గదుల్లో ఆభరణాలు
- 34 ఏళ్ల క్రితం లెక్కిస్తుంటే పాముల బుసలు
- తిరిగి ఇన్నాళ్లకు గదులు తెరిచేందుకు అనుమతి
ఇక ఇప్పుడు ఆలయ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ఒడిశా హైకోర్టు, ప్రభుత్వం అనుమతుల మేరకు జగన్నాథ ఆలయ ఖజానా (రత్న భండార్)ను తెరవాలని నిర్ణయించారు. ఈ రత్న భండార్ ఎంత పటిష్ఠంగా ఉందన్న విషయాన్ని పరిశీలిస్తామని, ఆపై మరింత భద్రతను కల్పించే విషయమై చర్చిస్తామని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా వెల్లడించారు. ఖజానాలో ఉన్న సంపదను లెక్కించాలని తాము భావించడం లేదని అన్నారు. కాగా, 1984 ప్రాంతంలో ఇదే ఆలయంలో పని చేసిన ఆర్ఎన్ మిశ్రా మాట్లాడుతూ, అప్పట్లో పాములు బుస కొట్టగా, నాలుగో గదిని తాము తెరవలేదని స్పష్టం చేశారు.