మూగవానిగా నారా రోహిత్ .. ఆయన జోడీగా నివేదా థామస్
- నారా రోహిత్ హీరోగా 'శబ్దం'
- ఇంతవరకూ చేయని పాత్ర
- ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్
నారా రోహిత్ జోడీగా నివేదా థామస్ ఓకే అయినట్టుగా సమాచారం. నివేదా థామస్ కి తెలుగులో మంచి క్రేజ్ వుంది. 'జై లవ కుశ ' సినిమా హిట్ అయినా ఆ తరువాత ఆమె కొత్త సినిమాలకి సైన్ చేయలేదు. తాను చేస్తోన్న కోర్సును పూర్తిచేయాలనే ఆమె కొంత గ్యాప్ తీసుకుందట. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె, నారా రోహిత్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.