నితిన్ మూవీలో పొగరుగల అత్తగా సీనియర్ హీరోయిన్!
- నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
- కథానాయికగా మేఘా ఆకాశ్
- ఆమె తల్లి పాత్రలో లిజి
కథ ప్రకారం ఈ సినిమాలో కథానాయిక మేఘా ఆకాశ్ పొగరుగా ప్రవర్తిస్తూ వుంటుందట. ఇక ఆమె తల్లి పాత్ర ( నితిన్ కి అత్త) కూడా పొగరుగా వ్యవహరిస్తూ ఉంటుందని అంటున్నారు. సీనియర్ హీరోయిన్ 'లిజి' ఈ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. గతంలో ఆమె 'మగాడు'.. '20వ శతాబ్దం' .. 'ఆత్మబంధం' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 'ఛల్' మోహన్ రంగ'ను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.