'మెహబూబా' మూవీ ప్రత్యేకతల్లో ఇదొకటి!
- పూరీ దర్శకత్వంలో 'మెహబాబా'
- కొనసాగుతోన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- వేసవిలో విడుదల దిశగా ఏర్పాట్లు
ఈ సినిమాలో మురళీశర్మ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. ఇందులో ఆయన భార్య పాత్రను .. నిజజీవితంలో భార్య అయిన 'అశ్విని'నే పోషించడం విశేషం. అంటే నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట .. ఈ సినిమాలో అలాగే కనిపించనున్నారన్న మాట. ఈ సినిమాకి గల ప్రత్యేకతల్లో ఇదొకటిగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మురళీశర్మ భార్య అశ్విని పలు సినిమాల్లోనూ .. సీరియల్స్ లోను నటిస్తూ వస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆమె కూడా తెలుగులో మరింత బిజీ అవుతుందేమో చూడాలి.