'సైరా' షూటింగుకి నయనతార వచ్చేసింది
- 'సైరా ' రెండవ షెడ్యూల్ మొదలు
- కీలక సన్నివేశాల చిత్రీకరణ
- త్వరలో జాయిన్ కానున్న అమితాబ్
ప్రస్తుతం చిరంజీవి .. నయనతార .. జగపతిబాబు కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను, హైదరాబాద్ - నానక్ రామ్ గూడాలో చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా అనిపిస్తాయని అంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో అమితాబ్ జాయిన్ కానున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి