తేజ సినిమా కోసం 15 కేజీలు తగ్గనున్న నారా రోహిత్
- తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే'
- వెంకటేశ్ బావమరిది పాత్రలో నారా రోహిత్
- ఒక కథానాయికగా అదితీరావు
ఈ ఇద్దరూ కూడా ఈ సినిమాలో బావ - బావమరుదులుగా కనిపించనున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం బాగా బరువు తగ్గాలని రోహిత్ కి తేజ చెప్పాడట. దాంతో బాగా కసరత్తులు చేసిన రోహిత్ 10 కేజీల వరకూ బరువు తగ్గాడట. మరో 5 కేజీల వరకూ తగ్గాలని తేజ అనడంతో .. ప్రస్తుతం రోహిత్ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. ఇక ఒక కథానాయికగా అదితీరావును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.