25వ సినిమాకి రెడీ అవుతోన్న అక్కినేని ఫ్యామిలీ హీరో
- సుమంత్ తదుపరి సినిమాకి సన్నాహాలు
- 'ఉగాది' రోజున ప్రారంభోత్సవం
- నూతన దర్శకుడికి అవకాశం
'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు, హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. బొగ్గరం ధీరజ్ .. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.