పవన్ 'నో' చెప్పడంతో మరో హీరోతో 'కందిరీగ' దర్శకుడు
- సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గోపీచంద్
- నిర్మాతగా బీవీఎస్ ఎన్ ప్రసాద్
- ఈ నెల 18వ తేదీన ప్రారంభం
వేరే హీరోతో ముందుకెళ్లమని ఆయనకి పవన్ చెప్పినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దాంతో ఆయన తన తదుపరి సినిమా హీరోగా గోపీచంద్ ను ఎంచుకున్నట్టు సమాచారం. బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను ఆ రోజున వెల్లడించే అవకాశం వుంది.