వై.ఎస్.ఆర్. బయోపిక్ లో మమ్ముట్టి సరసన నయనతార?
- వై.ఎస్.ఆర్.బయోపిక్ కి సన్నాహాలు
- ప్రధాన పాత్రలో మమ్ముట్టి
- దర్శకుడిగా మహి వి. రాఘవ్
రాజశేఖర్ రెడ్డి పాత్రకోసం మమ్ముట్టిని సంప్రదించగా ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన భార్య పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, నయనతారను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. మలయాళంలో మమ్ముట్టి .. నయనతార కాంబినేషన్లో వచ్చిన 'భాస్కర్ ది రాస్కెల్ ' .. పుతియా నియమం' సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇంకో వైపున ఈ ఇద్దరితోను సంప్రదింపులు జరగలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.