ఉత్పత్తుల ప్రచారానికి ప్రియా ప్రకాశ్‌కి భారీ మొత్తంలో కంపెనీల ఆఫర్లు..!
- ప్రియా క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు కంపెనీల క్యూ
- ఉత్పత్తుల ప్రచారానికి ఒక్కో పోస్టుకు 8 లక్షలిస్తామంటూ ఆఫర్లు
- 5.8 మిలియన్లను దాటిన ముద్దుగుమ్మ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య
తమ ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతామని ఆమెకు ఆఫర్ ఇస్తున్నాయట. ప్రియా తన ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే రూ.8 లక్షల వరకు ఇస్తామంటూ ఆమెకు పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. కాగా, ప్రియా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అతి తక్కువ సమయంలోనే 5.8 మిలియన్లను దాటేసింది.