తాజ్మహల్ సందర్శకులకు గుడ్న్యూస్....ఇక సూర్యోదయానికి ముందే టికెట్ల విక్రయం
- సందర్శన వేళల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు
- సూర్యోదయానికి 45 నిమిషాలకు ముందే టికెట్ కౌంటర్లు ఓపెన్
- లోక్సభలో కేంద్ర మంత్రి మహేశ్ శర్మ వెల్లడి
తాజ్మహల్ సందర్శన వేళల్లో మాత్రం ఎలాంటి మార్పులూ చేయలేదని ఆయన చెప్పారు. సూర్యోదయానికి 45 నిమిషాల ముందుగా టికెట్ కౌంటర్లను తెరిచి సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు మూసేస్తామని ఆయన తెలిపారు. భారత పురావస్తు శాఖ జనవరి 25, 2018న జారీ చేసిన ఆదేశాల ప్రకారం, తాజ్ మహల్ సందర్శనకు సంబంధించిన ప్రధాన గేట్లను సూర్యోదయానికి అర గంట ముందు తెరిచి, సూర్యాస్తమయానికి అర గంట ముందు మూసేస్తున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారాల్లో సెలవు కారణంగా వారసత్వ సంపదగా భావితరాలకు అందివస్తున్న మొఘల్ కాలం నాటి ఈ కట్టడ సందర్శనకు వీలుండదు.