అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇలా చేస్తున్నాను... సాయి పల్లవి!
- మేకప్ లేకుండా యాక్టింగ్ చేయడమే ఇష్టం
- ఇందుకు ప్రేమమ్ దర్శకుడు పుతెరిన్ కారణం
- సహజంగా నటించమని ఆయన ప్రోత్సహించారు
అంతేకాక ఆమె 'నో మేకప్' నిర్ణయం వెనుక ఓ చిన్న కథ కూడా ఉంది. తన తొలి సినిమా 'ప్రేమమ్' దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ సహజంగా నటించమని తనను ప్రోత్సహించారని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే తాను ఎక్కువగా మేకప్ లేకుండానే నటించేందుకు ఇష్టపడతానని ఈ పింపుల్స్ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇతర దర్శకులు కూడా తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రోత్సహించారని ఆమె తెలిపింది. మరోవైపు నాగశౌర్య, సాయి పల్లవి జంటగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'కణం' చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.